Followers

రెడ్ జోన్ కుటుంబాలకు దాతలు దాతృత్వం.


రెడ్ జోన్ కుటుంబాలకు దాతలు దాతృత్వం.



తాళ్లపూడి, , పెన్ పవర్:



పైడిమెట్ట లోని రెడ్ జోన్ కుటుంబాలకు శుక్రవారం దాతలు తమ దాతృత్వం చూపించారు. పైడిమెట్ట పంచాయితీ టాంక్ వాచరు గెడ్డం రాజు పాలు పాకెట్స్ పంచిపెట్టగా, కొయ్యలగూడెంలోని చర్చ్ పాస్టర్ కె. డేవిడ్ రాజు, అన్నామని దంపతులు కూరగాయల కిట్లు పంపిణీ చేశారు. నల్లజర్ల  కు చెందిన దూలపల్లి రవి ప్రసన్న బాబు, లక్ష్మి ప్రసన్న దంపతులు రెడ్ జోన్ కుటుంబాల వారికి చికెన్ అందచేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొల్లి దుర్గారావు, టీడీపీ నాయకులు కొప్పాక పోశియ్య, కొప్పాక రాజు, వెంకట్రావు,అవినాష్,ప్రమోద్ పాల్గొన్నారు. వాలంటీర్లు కొప్పాక జనప్రియ,పావని సహకారం అందించారు.అదేవిధంగా శనివారం నాడు
రెడ్ జోన్ కుటుంబాలకు, గ్రామానికి చెందిన వాలంటీర్ కొప్పాక జనప్రియ తన ఒక నెల జీతాన్ని హెచ్చించి పాలు , కిరాణా సరుకులు అందచేసింది. కార్యక్రమంలో వైసీపీ నాయకులు యాళ్ల బాబురావు, కొల్లి దుర్గారావు, పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్ , సుబ్బారావు, పసలపూడి ఆశీర్వాదం, పుష్పరాజు,పోసియ్య, రాజు, జొన్నకూటి రాజు తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...