Followers

అన్నా మినిస్ట్రీస్" కరోనా వారియర్ అవార్డ్ కు ఎంపికైన ప్రసాదం


*"అన్నా మినిస్ట్రీస్" కరోనా వారియర్ అవార్డ్ కు ఎంపికైన ప్రసాదం*


ఆలమూరు,  పెన్ పవర్ :


అన్నా మినిస్ట్రీస్ ఇండియా స్వచ్ఛంద సేవాసంస్థ" వారు అందించే "కరోనా వారియర్ అవార్డ్"కు మండల కేంద్రమైన ఆలమూరుకు చెందిన సంగీత శ్రీ విద్య వైద్య ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు వరిగీటి ప్రసాదం ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు ఐఈ కుమార్ నుండి సమాచారం అందిందని ప్రసాదం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నా మినిస్ట్రీస్ సంస్థ ప్రతి ఏటా 25 మంది స్వచ్ఛంద సేవకులను గుర్తించి వారికి "మదర్ సోలప్రిడ్ స్వేన్డ్ సన్" పేరుతో ఈ అవార్డ్ ప్రధానం చేస్తుంది. స్వచ్ఛంద సేవ సభ్యురాలైన ప్రసాదం లాక్ డౌన్  సమయంలో అలమూరుతో పాటు రాజమహేంద్రవరం సిటీ, రూరల్ , మండపేట, కపిలేశ్వరపురం, కె గంగవరం మండలాల్లోని పేదలకు,పారిశుద్ధ్య కార్మికులకు, రోడ్లు ప్రక్కన నివసించే యాచకులకు ఆహారం, కరోనా భద్రత కిట్లు పంపిణీ చేయడంతో పాటు వారికి  చేసిన సేవలకు గానూ ఈ అవార్డ్ కు ఎంపిక చేసినట్టు అన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత ఐఈ కుమార్ తెలిపారని పేర్కొన్నారు. ఈ అవార్డ్ రావడం ప్రజలకు సేవలను చేసేందుకు మరింత బాధ్యత పెంచిందన్నారు. ఆగస్టు 5వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరిగే వేడుకల్లో  ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందజేస్తారన్నారు. ఈ సందర్భంగా అన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఇండియా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు ఐఈ కుమార్ కు ప్రసాదం కృతజ్ఞతలు తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...