న్యాయవాది బోస్ అరెస్టును ఖండించిన బార్ అసోసియేషన్.
ఏలేశ్వరం,పెన్ పవర్
ఏలేశ్వరం కు చెందిన యువ న్యాయవాది పైల సుభాష్ చంద్రబోస్ ను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా సోమవారం ఏలేశ్వరం విచ్చేసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుగత శివ మాట్లాడుతూ రాజమండ్రిలో నమోదైన కేసులో ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు బోస్ ఇంటిపై ఆదివారం అర్ధరాత్రి దాడి చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి అరెస్టు చేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితున్ని అరెస్ట్ చేసే ముందు సి ఆర్ పి సి సెక్షన్ 41 ఏ నోటీసును ఇవ్వాలన్నారు. కానీ పోలీసులే నిబంధనలను తుంగలో తొక్కి అరెస్టుకు పాల్పడ్డారని బార్ అసోసియేషన్ భావిస్తోందన్నారు. అరెస్టుపై విచారణ జరిపించి ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment