Followers

వర్కింగ్ జర్నలిస్టులను వారియర్స్ గా గుర్తించాలి


*వర్కింగ్ జర్నలిస్టులను వారియర్స్ గా గుర్తించాలి*
*ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నినాదాలు*
*కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల  కుటుంబాలకు సత్వరమే 50 లక్షల భీమ వర్తింపజేయాలి*
*డిటి రామ్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టులు*


పెద్దాపురం పెన్ పవర్



 రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న పాత్రికేయులను కరోనా వారియర్స్ గా గుర్తించి కరోనా భీమాను వర్తింపజేయాలని ఏపీయుడబ్ల్యూజే పెద్దాపురం నియోజకవర్గ  పాత్రికేయులు కోరారు యూనియన్ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్త కోర్కెల దినం పురస్కరించుకొని ఏపీ యుడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకుర్తి రాంబాబు ఆధ్వర్యంలో శనివారం ఆర్టీవో కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం డి.టి. రామ్ కుమార్ కు  వినతిపత్రం  అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు  అడపా వెంకట్రావు రెడ్డిపల్లి రమణమూర్తులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారికి మించిన విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు బీమా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే కరోనాతో మృతిచెందిన జర్నలిస్ట్ల కుటుంబాలకు  సత్వరమే 50 లక్షల రూపాయల భీమాను వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకుర్తి రాంబాబు . ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్ర దాస్ కోశాధికారి వర్మ లు మాట్లాడుతూ విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు సమాచార శాఖ ద్వారా భద్రత పరికరాలను అందజేయాలని మిత్రులందరికీ వైద్య ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్  పూర్వపు  అధ్యక్షులు బురాడ శ్రీనివాసరావు నియోజకవర్గ నాయకులు ఆలి ఎన్ పి ఎస్ .  వినాయక్  ఎన్ శ్రీరామ్ పచ్చ ఆకుల లోవరాజు చవ్వాకుల ఈశ్వరరావు రాయవరపు వీరబాబు  వెంకట్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...