రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బి.జె.పి ఎమ్మెల్సీ పి.వి.యన్ మాధవ్ నిత్యావసరాల వస్తువుల పంపిణి
పూర్ణా మార్కెట్ పెన్ పవర్
రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్, ప్రకృతి చికిత్సాలయం మహారాణి పేట, భారతీయ జనతా పార్టీ వైద్య విభాగము, మెహర్ బాబా ఆర్థిక సహకారంతో 110 వ రోజు కలిసి నిర్వహించిన నిత్యావసర సరుకులు పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి.వి.యన్ మాధవ్. ఎమ్మెల్సీ ముందుగా నిత్యావసర సరకులను బియ్యం, నూనె,గోధుమపిండి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా ప్రతివారు సామాజిక సేవలో తోటి వారికి సహాయం అందించాలని గత 110 రోజులుగా రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ప్రశంసించారు.ప్రతివారు మాస్క్, గ్లౌజ్, సానిటైజర్ లను ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని ,అప్పుడే కరోనాను దూరం చేయవచ్చునని అన్నారు .కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి మోడీ ప్రతి క్షణము మాస్క్ వేసుకుంటున్నారాని వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమమునకు ఆర్థిక సహకారం అందించిన మెహర్ బాబా ని అభినందించారు . ఈ కార్యక్రమంలో డా.శిష్ట్లా శ్రీలక్ష్మి, రుపాకుల. రవి కుమార్, ఏపీ స్టేట్ బి జె పీ. మెడికల్ సెల్ కన్వీనర్, ఏస్.మహేష్, ఏస్.చాతుర్య, 29వ వార్డు బి జె పి. ప్రేసినెంట్ పల్లా.లక్ష్మి , డా. వై.లక్ష్మణ రావు, బి జె పి. లీడర్స్ పల్లా. చలపతి రావు, చుక్కాకుల.రాంబాబు, గెదల. శ్రీహరి, టి.గిరిజ, గౌతం, జీ.రాము, సీ హెచ్. రాజబాబు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment