ఒకేరోజు మండలంలో 9 పాజిటివ్ కేసులు
పెన్ పవర్, సీతానగరం
మండలం నందు ఒకేసారి 9 పాజిటివ్ కేసులు రావడంతో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాక్షికంగా లాక్ డౌన్ అమలవుతున్న సందర్భంలో శుక్రవారం 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మండల వైద్యాధికారిణి డాక్టర్ హారిక తెలియజేశారు. డాక్టర్ హారిక మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలో పలువురికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 9 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యురాలు తెలియజేశారు. ఇటీవల మండలంలో 12 కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఈ 9 కేసులతో 21 కేసులు నమోదు కావడంతో సీతానగరం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడిన వైనం ఏర్పడింది. ఇనుగంటివారి పేట 1, సీతానగరం 1, రఘుదేవపురం గ్రామానికి చెందిన చిన్నకొండేపూడి సచివాలయం నందు వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి 1, మొగ్గళ్ళ గ్రామం 2, ఉండేశ్వరపురం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ రాజమహేంద్రవరం నందు పనిచేస్తున్న ఇబ్బంది 3, సీతానగరం పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ 1 ప్రస్తుతం వారు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని డాక్టర్ హారిక తెలిపారు.
No comments:
Post a Comment