ఏలేశ్వరంలో 9 రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్
ఏలేశ్వరం, పెన్ పవర్
పట్టణ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో 16 తేదీ గురువారం నుండి 24వ తేదీ శుక్రవారం వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి కృష్ణ మోహన్ ప్రకటించారు . కరోనా మహమ్మారితో పట్టణంలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా, 21 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. పట్టణంలో మంగళవారం ఒక్క రోజే 5 కరోనా కేసులు నమోదయ్యాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు కఠినంగా లాక్ డౌన్ అమలుచేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత 15 రోజులుగా ఉదయం 6 నుండి11 గంటల వరకు మాత్రమే సడలింపు కొనసాగుతుండగా, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గురువారం నుండి 24వ తేదీ వరకు పూర్తి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఎస్ ఐ కె సుధాకర్ మంగళవారం తెలిపారు. ఈ ఎనిమిది రోజుల పాటు ఎవరైనా ఇంటి నుండి బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
No comments:
Post a Comment