జిల్లా అభివృద్ధికై దివంగత దామచర్ల ఆంజనేయు చేసిన కృషి ఎనలేనిది
జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుర్రా రాజ్‌విమల్
(పెన్‌పవర్ స్టాఫ్ రిపోర్టర్, ఒంగోలు )
మాజీ మంత్రి, మాజీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల ఆంజనేయులు 91వ జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశంపార్టీ నాయకులు బుధవారం ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా తొలుత ఒంగోలు నగరంలోని బాపూజీ కాంప్లెక్స్, కర్నూలు రోడ్డు ప్లైఓవర్ వద్ద గల దామచర్ల ఆంజనేయలు , నందమూరి తారకరామారావు, తెలుగు తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దామచర్ల ఆంజనేయలు 91వ జయంతోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుర్రా రాజ్ విమల్ మాట్లాడుతూ దామచర్ల ఆంజనేయలు తూర్పునాయుడుపాలెం అనే గ్రామంలో సాధరణ వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ చుట్టూ ఉన్నవాళ్ళకి సహాయపడతూ, తెలుగుదేశం జెండా భుజాన వేసుకొని, కొండపిలో తె.దే.పా జెండా పాతి, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ... కొండపిని తెలుగుదేశంపార్టీ కంచుకోటగా నిలిపి రాజకీయాలలో సైతం తనదైన ముద్రవేసి ప్రకాశంజిల్లా నుంచి మంత్రిగా ప్రజాసేవ చేసి, అందరూ, ఆప్యాయంగా పెద్దాయన అని పిలిపించుకునేవారన్నారు. ఆయన చనిపోయిన కూడా మంత్రిగా చేసిన అభివృద్ధిలో ఆయన వారసుడు మన తె.దే.పా జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్ధన్ రావు ఒక టర్మ్ ఎమ్మెల్యేగా చేసిన కూడా ఒంగోలు నియోజకవర్గంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి ప్రధాతగా ప్రకాశంజిల్లా తె.దే.పా అధ్యక్షులుగా మూడు దఫాలుగా అటు ఇటు జోడెద్దు మాదిరిగా రెండిరటి బాధ్యతలను నిర్వహిస్తూ తన వారసుడుగా తనదైన ముద్రను నిలుపుకున్నారని అన్నారు. మేమందరం కూడా తె.దే.పా దామచర్ల ఆంజనేయలు ఆశయ సాధన కోసం మన జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధనరావు అడుగు జాడలో నడుస్తూ జిల్లాలో, రాష్ట్రంలో తె.దే.పా అధికారంలో తీసుకురావటానికి శక్తివంచనలేకుండా కృషిచేస్తామని అన్నారు. ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ దామచర్ల ఆంజనేయలు మంత్రిగా జిల్లాకు ఎనలేని సేవలు అందించారని, జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులుగా పార్టీని సుదీర్ఘకాం ముందుకు నడిపించినటువంటి ఘనత ఆంజనేయలుకే దక్కుతుందన్నారు. వ్యక్తిత్వంలో సౌమ్యుడిగా ఎన్ని పదవులు అలంకరించినా, క్రింద స్థాయి కార్యకర్తను కూడా ఆప్యాయంగా పలుకరించే వారని, ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒంగోలు మాజీ ఏఎంసి మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దామచర్ల ఆంజనేయలు సుదీర్ఘకాం జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ఆయన జిల్లాలో దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజి, పాలిటెక్నిక్ కాలేజీ విద్యాసంస్థలు నెలకొల్పి అనేక మంది విద్యార్ధులకు విద్యను అందించిన విద్యాదాత అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, జిల్లా తెదేపా నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు రావు పద్మజ, రాష్ట్ర మహిళా నాయకులు ఆర్ల వెంకటరత్నం, ఉప్పపాటి నాగేంద్రమ్మ, జిల్లా తె.దే.పా కోశాధికారి ఎల్.టి భవాని, ప్రధాన కార్యదర్శి దాయనేని ధర్మ, పెళ్లూరి చిన్న వెంకటేశ్వర్లు, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు నావూరి కుమార్, జిల్లా తె.దే.పా నాయకులు పాతూరి ప్లుయ్య చౌదరి, మారినేని వెంకటేశ్వర్లు, బొడపాటి వెంకట్, కనుమూరి నారాయణ, డొక్కా శ్రీమన్నారాయణ, కసుకుర్తి అంకరాజు, జిల్లా తెలుగుమహిళా నాయకులు గంగవరపు పద్మ, టి.అనంతమ్మ, ప్రశాంతి, నాగేశ్వరమ్మ, కొక్కిగడ్డ లక్ష్మీ, అజిమున్నీసా, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment