Followers

కిరణ్ కుమార్ కు పలువురు అభినందనలు



కిరణ్ కుమార్ కు పలువురు అభినందనలు



డీఎస్పీ గా పదోన్నతి పొందిన సనపల


 


పూర్ణా మార్కెట్, పెన్ పవర్


 


1991లో ఎస్సైగా బాధ్యతలు చేపట్టి, విశాఖ రేంజ్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కిరణ్ కుమార్ కు  డీఎస్పీ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 2005లో సీఐగా పదోన్నతి లభించింది. అప్పటి నుంచి వివిధ సర్కిల్ లో పనిచేశారు. 2019 సంవత్సరం ఉగాది సందర్భంగా పోలీస్ సేవా పథకం  ప్రభుత్వం నుంచి అందుకున్నారు. నేడు డీఎస్పీగా పదోన్నతి ‌ పొందిన కిరణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో 50వ వార్డ్  వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వావిలపల్లి ప్రసాద్, సనపల సన్యాసిరావు, సనపల గోవిందరాజు, టిడిపి నాయకుడు సనపల పాండురంగారావు, సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ హనుమాన్ లక్ష్మణ్ రావు, సనపల ప్రసన్న కుమార్, సీపాన రాంప్రసాద్. భవిష్యత్తులో కిరణ్ కుమార్ గారు మరిన్ని ఉన్నత పదవులకు చేరుకోవాలని వీరంతా కోరుతున్నారు. స్నేహశీలి అందరికీ అందుబాటులో ఉండే కిరణ్ కుమార్ కు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి పలువురు అభినందనలు తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...