ఘనంగా పచ్చతోరణం ప్రారంభం...
సామర్లకోట, పెన్ పవర్
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్వహిస్తున్న పచ్చతోరణం కార్యక్రమం క్రింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో మున్సిపాలిటీ లో బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈవో పిఆర్డీ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఏసుబాబు,తహసీల్దార్ వి జితేంద్ర, ఈవోపిఆర్డీ సూర్యనారాయణ లు మాట్లాడుతూ ఈ పథకం క్రింద అన్ని గ్రామ సచివాలయల పరిధిలో 6500 మొక్కలు నాటుతునట్టు చెప్పారు.పర్యావరణ పరిరక్షణకు,పచ్చదనాన్ని వృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నoదున ఈ కార్యక్రమాలను అన్ని గ్రామాల్లో చేపడుతున్నట్టు వారు చెప్పారు.మొక్కలు నాటడంతో వదలి పెట్టకుండా వాటిని సంరక్షించే విషయంలో ను పంచాయతీ,గ్రామ సచివాలయ సిబ్బంది బాధ్యత తీసుకోవాలని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇ సి హెచ్ రామారావు, శానిటర్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్,గ్రామ వైసీపీ నాయకులు గోలి వెంకట్రావు,బొబ్బరాడ సత్తిబాబు,పంచాయతీ, సచివాలయ సిబ్బంది హెచ్ ఎం లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment