పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసిన మైగాపుల దుర్గాప్రసాద్
పోలవరం పెన్ పవర్
పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని మైగాపుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వైసిపి పోలవరం మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ చేతులమీదుగా పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ వారి ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేశారు. కొత్త పట్టిసీమలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నాటి నుండి కొత్త పట్టిసీమ కంటోన్మెంట్ జోన్ పరిధిలోని ప్రజలకు కూరగాయలు, కిరాణా , రోగనిరోధక శక్తిని పెంచే సామాగ్రి లను కొద్ది రోజుల క్రితం పంపిణీ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేస్తూ కొత్త పట్టిసీమ ప్రజలకు సేవలందిస్తూ వారికి అండగా ఉంటున్న మైగాపుల దుర్గా ప్రసాద్ కు స్థానిక ప్రజలు, నాయకులు అభినందనలు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వైసిపి పోలవరం మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, మైగాపుల దుర్గాప్రసాద్, గంగు అనిల్ కుమార్, ఆకుల సత్యనారాయణ, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment