Followers

కేంద్ర ప్రభుత్వం కార్మిక  రైతాంగ  ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి





కేంద్ర ప్రభుత్వం కార్మిక  రైతాంగ  ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి


 


సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు 


బోనంగి చిన్నయ్య పడాల్.


 


 చింతపల్లి  ,  పెన్ పవర్


 

 బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేంద్రంలో తీసుకున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు.గురువారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక నాయకులతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ ఎల్ తిరుమల బాబుకు పదకొండు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు కార్మిక చట్టాలను రద్దు చేయడంతోపాటు కార్మికులను అనేక విధాలుగా ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రైతు,కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి సుస్థిర పాలన సాగించాలన్నారు. కరోనా కష్టకాలంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, అంగనవాడి, గ్రామ వాలంటరీల సేవలను గుర్తించి మూడు నెలల పాటు అదనంగా నెలకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, మధ్యాహ్న భోజన యూనియన్ నాయకులు నాగలక్ష్మి, నాగరత్నం, కుమారి తదితరులు పాల్గొన్నారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...