Followers

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి




రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి



 

 

సఖినేటిపల్లి, పేన్ పవర్...

 

సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్వేది దేవస్థానం గుర్రాలక్కగుడి రోడ్డు పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో, ఒక వ్యక్తి మరణించినట్లు సఖినేటి పల్లి మహిళా ఎస్సై. భవాని చెప్పారు. అబ్బ దాసు. సాయి అనే వ్యక్తి ఏ.పీ. 37 బి. ఎల్. 36 04 నెంబరు గల సి.బి.జెడ్ మోటార్ సైకిల్ పై అంతర్వేది వస్తుండగా, ఒక్కసారిగా మోటార్సైకిల్ అదుపు తప్పడంతో, రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు, ఆమె చెప్పారు. మృతుడు ఏడవ తరగతి వరకూ చదివి,చదువు మధ్యలో అపి వేసాడని, రోజు వారి కూలీ పనులు, చేస్తూ ఉండేవాడు అన్నారు. ఇటీవలే ఇతనుఅప్పన రాముని లంకలోని ఒక చికెన్ షాపులో, రోజు వారి కూలీ కి పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ భవాని చెప్పారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...