మహనీయుల సేవలు చిరస్మరణీయం
సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
డోన్,పెన్ పవర్
జూలై 24 న మహాకవి శ్రీ గుర్రం జాషువా గారి వర్థంతి మరియు గ్రంథాలయ పితామహుడు శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారి జయంతి సందర్భంగా
డోన్ పట్టణం నందు సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో గ్రంథాలయ పితామహుడు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి జయంతి మరియు మహకవి గుర్రం జాషువా గారి వర్థంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళులర్పించారు వారిని స్మరించుకున్నారు.
ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
*మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు*
1) మహకవి శ్రీ గుర్రం జాషువా గారు 1895,
సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ
మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. విద్యభ్యాసం చేస్తున్న సమయంలో
మూఢాచారాలతో నిండిన సమాజంలో చాలా అవమానాలు భరించాడు. సమాజం లో చైతన్యం తీసుకురావాలనే అశయంతో పని చేసాడు. మంచి కవిగా సామాజిక ప్రయోజనం కోసం కవిత్వానికి పదును పెట్టాడు.మూఢాచారాలు, మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యపరిచి సామాజిక ప్రయోజనం కోసం రచనలు చేసాడు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డారు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు,
పురస్కారాలు అందుకున్నాడు.కవితా
విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధురశ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నాడు. గుర్రం జాషువా గారు 24-7-1971న స్వర్గస్తులైనారు.
2) శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారు తూర్పు గోదావరి జిల్లాలోని కొంకుదురు గ్రామంలో 1890 జూలై 24న జన్మించారు. ఈయన ఆయుర్వేదం, ప్రకృతివైద్యంలో సిద్ధ హస్తులు మరియు పత్రికా సంపాదకుడు. తెలుగువారైన అయ్యంకి వెంకటరమణయ్య కృషితో మనదేశంలో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది.ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి పలు రాష్ట్రాలలో గ్రంథాలయాలను స్థాపించారు. 1912లో నవంబరు 12న ఆనాటి మద్రాస్ ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ మీటింగ్‌ని రమణయ్య నిర్వహించారు. ఫలితంగా నవంబరు 14న జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించారు.అయ్యంకి కృషితోనే ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ ఏర్పడింది. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు.ఈయన 19 వ ఏటనే
శ్రీ బిపిన్ చంద్ర పాల్ గారి ని ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవ వైపు అడుగులేసి 1910లో బందరులో ఆంధ్ర సాహిత్య పత్రికను స్థాపించి గురజాడ,
రాయప్రోలు ,శ్రీశ్రీ రచనలను ప్రచురించి ప్రజలను చైతన్య పరిచారు. విజయవాడలో రామ్మోహన్ ధర్మ పుస్తక భాండాగారం తో అనుబంధం పెంచుకొని ఆ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యారు. 1934 -48 మధ్య కోస్తా, ఆంధ్రా ప్రాంతాలలో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు .1972లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు .అలాగే గ్రంథాలయ పితామహా, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు.వీరు 1979 మార్చి 7న దివంగతులైనారు.ఇలాంటి మహానుభావులను అనుసరించి వారి ఆశయాలను కొనసాగించాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.
No comments:
Post a Comment