Followers

ఏపీయూడబ్ల్యూజే అనుబంధ పరవాడజర్నలిస్టుల ప్రధమ ఆత్మీయ సమావేశం ముఖ్యఅతిథిగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి జోగినాయుడు






ఏపీయూడబ్ల్యూజే అనుబంధ పరవాడజర్నలిస్టుల ప్రధమ ఆత్మీయ సమావేశం ముఖ్యఅతిథిగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి జోగినాయుడు

 

          పరవాడ పెన్ పవర్

 

 పరవాడ: జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీయూడబ్ల్యూజే యూనియన్ కట్టుబడి ఉందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి జోగినాయుడు స్పష్టం చేశారు.ఆదివారం భరణికం గ్రామంలో ఏపీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్య వర్గం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ లోకేష్ , కార్యదర్శి విశ్వనాధం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టుల వ్యక్తిగత ప్రమాద బీమా, ఆరోగ్య భీమా, ఇళ్ల స్థలాలు, గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రెస్ క్లబ్ సమస్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది.ఈ కార్యక్రమానికి ముందు కరోనా వైరస్ కారణంగా  శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఈనాడు విలేఖరి  చిన్న రత్నం మృతికి ప్రెస్ క్లబ్ సభ్యులు సంతాపం తెలియజేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు జోగి నాయుడు, రాంబాబు మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉంటే హక్కలను సాధించుకోవడానికి వీలవుతుందన్నారు.అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఆమోదయోగ్యమైన స్థలాల్లో ఇళ్ల స్థలాలు పొందేలా యూనియన్ కృషి చేస్తుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే కృషి వల్లనే  రైల్వే, బస్సుల్లో జర్నలిస్టులు ప్రయాణించటానికి ఉచితంగా పాసులు మంజూరయ్యాయన్నారు.జర్నలిస్టుల వ్యక్తిగత భీమాతో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ , ఆరోగ్య భీమ తదితర సౌకర్యాలు కొరకు యూనియన్  కృషి చేసిందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు పేర్కొన్నారు. జిల్లాలో ఏపీయూడబ్ల్యూజే  జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని అన్నారు. పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులకు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పి. సన్యాసిరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ సభ్యులు రవి, ప్రెస్  క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పి.వి.రమణ,కే. సోము నాయుడు, సిహెచ్. అనిల్ కుమార్, సిహెచ్. గోపి, కె. శివాజీ, బి. గోపీనాథ్, ఎం. అప్పలరాజు (బాబు), శ్యామ్, సభ్యులు కే. శ్రీను,కే. అప్పారావు, గండి రమేష్, యు. చందు, సత్యనారాయణ, రవి, పి. నాగరాజు, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.


 

 




 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...