లాక్ డౌన్ సడలింపు లపై సీ ఐ సుధాకరరావు
ఇక ప్రతి వారం సోమ. మంగళ. గురు. శుక్రవారాల లో. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్యలో మాత్రమే లాక్ డౌన్ సడలింపు
గిద్దలూరు,పెన్ పవర్
ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ కొమరోలు గిద్దలూరు రాచర్ల బెస్తవారిపేట లో లాక్ డౌన్ సడలింపు లపై అత్యవసర సమావేశం అనంతరం సీఐ సుధాకరరావు మున్సిపల్ కమిషనర్ హైమావతి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు, లాక్ డౌన్ సడలింపు లపై ఈ సందర్భంగా సిఐ సుధాకర రావు మాట్లాడుతూ ఈ వారంలో రేపు బుధవారం మరియు గురువారం కట్టుదిట్టమైన లాక్ డౌన్ ఉంటుందండి ఈ వారంలో శుక్రవారం శనివారం లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే అనుమతులు ఇస్తూ నిత్యావసరాలు ముఖ్య గమనిక (పాలు కూరగాయలు నిత్యవసర వస్తువులు కు) మాత్రమే అనుమతులు ఉంటాయని ఇక ప్రతి వారం సోమ. మంగళ.గురు.శుక్ర వారాలలో మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు అనుమతులు అని
మిగతా ఎటువంటి వ్యాపార సముదాయాలకు ఎటువంటి దుకాణాలు వ్యాపారాలకు అనుమతులు లేవని
కేవలం అత్యవసర పరిస్థితులు ఆస్పత్రి మెడికల్ షాపులకు అనుమతులు ఉన్నాయని అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ఇంటి నుండి బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు అలా కాదని ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా బయటికి వస్తే 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉంచుతామని హెచ్చరించారు
తదుపరి ప్రకటన విడుదల చేసే వరకు ఇవే లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతాయని సుధాకర రావు వెల్లడించారు.
No comments:
Post a Comment