సారా అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
సారా అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తెలిపారు
జగ్గంపేట మండలం లోని మామిడాడ గ్రామానికి చెందిన దెయ్యాల వీర రాఘవులు(20), సారాతో , అదేవిధంగా జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామానికి చెందిన పప్పల లోవరాజు( 20 ) సారాతో ఈ ఇద్దరు వ్యక్తులు వేరువేరు మార్గాల ద్వారా సారాను అక్రమంగా తరలిస్తున్న ట్లు జగ్గంపేట పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తమ సిబ్బందితో తనిఖీ చేయగా సార అక్రమ రవాణా లో పట్టుబడ్డ వీరిద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద 20 లీటర్ల చొప్పున 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చడం జరిగిందని ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వీరికి పెద్దాపురం మెజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.
No comments:
Post a Comment