లాక్ డౌన్ పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోండి
జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు కృష్ణవేణి
గోకవరం ,పెన్ పవర్
కరోనా మహమ్మారి తరిమి కొట్టాలంటే జిల్లా లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయాలని తదనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు బురా కృష్ణవేణి అన్నారు. శనివారం ఏజెన్సీ పర్యటన వెళ్లి వస్తున్నా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు బూరా కృష్ణవేణి గోకవరం లో తనను కలిసిన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు అక్కడ అక్కడ నమోదవుతున్నా ఆ సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుందని వైరస్ నిర్మూలన కోసం జిల్లాలో పూర్తిస్థాయి లో లాక్ డౌన్ విధించాలని ఈ విషయంపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ను కలిసి చర్చించడం జరుగుతుందనన్నారు, జిల్లా లో శనివారం ఒక్కరోజే వెయ్య యాభై ఒక కేసులు నమోదయ్యాయి అంటే కరోనా వైరస్ ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని మాస్క్ ధరించాలని,ప్రతి మనిషికి మనిషికి మధ్య రెండు మీటర్లు సామాజిక దూరం పాటించాలని జిల్లా ప్రజలను జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు బూరా కృష్ణవేణి కోరారు.
No comments:
Post a Comment