నిత్య అవసరాల కోసం రేపు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు: సి ఐ సుధాకరరావు
ఆర్మీ క్యాంటీన్ మద్యం షాపులు కూడా బంద్*
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు సర్కిల్లోని కొమరోలు, రాచర్ల, బేస్తవారిపేట, గిద్దలూరు మండలాలలో రేపు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు లాక్ డౌన్ సడలిస్తునట్లు సి ఐ సుధాకర రావు వెల్లడించారు.
అలానే కేవలం నిత్యవసర వస్తువులు, కూరగాయల దుకాణాలు తప్ప మిగతా దుకాణాలు ఏవి కూడా తెరవకూడదని, ఎటువంటి దుకాణాలకు అనుమతులు లేవని అంతేకాకుండా *ఆర్మీ క్యాంటీన్ మద్యం దుకాణాలు కూడా లేవని* ప్రజలు గమనించాలని అన్నారు.
తదుపరి కార్యాచరణ రేపు సాయంత్రం వెల్లడిస్తామని ఆప్పటివరకు ప్రజలు జాగ్రత్తగా వ్యవహరిస్తూ రేపు ఉదయం 9 గంటల తర్వాత ఇళ్లకే పరిమితం కావాలని లాక్ డౌన్ కొనసాగుతుందని అన్నారు.
అంతే కాకుండా ప్రజలు కూడా ఇంటి నుండి ఒకరు మాత్రమే బయటకు వచ్చి నిత్యవసర వస్తువులు, కూరగాయలను తీసుకువెళ్లాలని అంతేకానీ గుంపులుగుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని, కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా సి ఐ సుధాకరరావు విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment