ముదిరిన' వెలి 'వివాదం
- అధికారుల సమక్షంలోనే ఒక వర్గంపై మరొక వర్గం దాడి..
- ఒక మహిళ, ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు,
- గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు
రావులపాలెం మండలం లక్ష్మీపోలవరంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న వెలి వివాదం ముదిరి దాడులకు దారి తీసింది.
తమను వెలి వేసి సంఘ కార్యక్రమాలలో పాల్గొనకుండా అడ్డుకుంటున్న కుల పెద్దలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ సోమవారం లక్ష్మీపోలవరం గ్రామానికి చెందిన కొంతమంది దళితులు అమలాపురంలో ఆర్.డి.ఓ భవానీ శంకర్ కు వినతి పత్రం సమర్పించారు. గత నాలుగు సంవత్సరాలుగా తమ సొసైటీకి చెందిన సుమారు 15 ఎకరాల భూమి, కొబ్బరి చెట్లు,చెరువు , లీజుకు పాటలు పెట్టగా వచ్చిన ఆదాయాన్ని మాకు చెందకుండా అడ్డుకుంటున్నారని,
పాడేందుకు వెళ్లిన తమను మీరు సంఘంలో లేరు, మీకు పాడేందుకు అవకాశం ఇచ్చేది లేదు అంటూ తిరస్కరిస్తున్నారని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. తమను వెలి నుండి తక్షణం ఉపసమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని,లీజుకు పాట పాడేందుకు అవకాశం కల్పించాలని,సొసైటీ కి వచ్చే ఆదాయం మాకు కూడా చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం తహశీల్దార్ ఎం.డీ.యూసుఫ్ జిలానీ, సిఐ వి కృష్ణ,ఎస్సై పి.బుజ్జిబాబులు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇరు వర్గాల సభ్యులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు బాధిత ముప్పై మూడు కుటుంబాలను కుటుంబానికి రూ.4వేలు చొప్పున తప్పుగా చెల్లిస్తే సంఘంలో చేర్చుకుంటామని తేల్చి చెప్పారు. అయితే తామెందుకు డబ్బు కట్టాలని, ఒక్క రూపాయి కూడా కట్టేది లేదని తేల్చిచెప్పారు దీంతో శుక్రవారం రావులపాలెం తహశీల్దార్ కార్యాలయంలో మరో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని ఇరు వర్గాల వారు రావాలని సూచించారు. దీంతో ఇరు వర్గాలు అక్కడినుంచి వెళ్తున్న సమయంలో బాధిత కుటుంబాలకు చెందిన పెనుమాల రిషిప్రియ పై సంఘంలోని కొందరు రెండు పర్యాయాలు దాడి చేయడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. దాడిని అడ్డుకునేందుకు వచ్చిన సఖిలే అనిల్ కుమార్, సఖిలే సునీల్ కుమార్, బాదం ప్రభు రోషన్లపై సంఘస్తులు దాడిచేయడంతో గాయాలపాలయ్యారు.వీరితో పాడు సంఘ సభ్యులు నక్కా వెంకటరత్నం, నక్కా చంద్రశేఖర్ లు గాయపడ్డారు. ఇరువర్గాల వారని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి, రావులపాలెం ప్రైవేటు హాస్పిటల్ లకు తరలించారు.ఇరు వర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 24 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై పి బుజ్జిబాబు తెలిపారు.గ్రామంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్య గా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment