Followers

ఘనంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 71 వ జయంతి వేడుకలు.


 



 




తాడేపల్లిగూడెంలో ఘనంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 71 వ జయంతి వేడుకలు.

 

 

పెన్ పవర్. తాడేపల్లిగూడెం 

 

 

తాడేపల్లిగూడెం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంపోలీసు ఐలాండ్,బస్టాండ్, మసీదు సెంటర్లలో గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ.అయన మాట్లాడుతూ ది లెజెండ్ అనే పదానికి అర్థం వై.ఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. వై.ఎస్ రాజశేఖర రెడ్డి  హయాంలో నేను ఎమ్మెల్యే గా పనిచేయడం, తిరిగి వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి  దగ్గర ఎమ్మెల్యే గా సేవాలందించడం నా అదృష్టంగా భావిస్తున్నానుఅని అన్నారు. వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్రీ భాస్కరరావు, పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు జీ నాగు, జి సాంబయ్య, గొర్రెల శ్రీనివాస్ , పత్స మట్ల సావిత్రి, తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...