Followers

 70వ, వనమహోత్సవం


 70వ, వనమహోత్సవం

జగనన్న పచ్చతోరణం --
నవ్యాంధ్రప్రదేశ్ పచ్చల హారం

చింతపల్లి   , పెన్ పవర్

 దేశంలో ప్రస్తుతం 17 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలనే దృక్పథంతో జగనన్న పచ్చతోరణం- నవ్యాంధ్రప్రదేశ్ పచ్చల హారం పేరుతో 71వ, వనమహోత్సవం కార్యక్రమం చేపట్టామని స్థానిక అటవీ శాఖ రేంజ్ అధికారి     పి వి రవి వర్మ అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన 20 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా స్థానిక అటవీశాఖ అధికారులు విజ్ఞాన భారతి పాఠశాల పరిసరాలు, జగనన్న కాలనీ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అటవీ రేంజ్ అధికారి మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి ఇల్లు ఉండాలని, ప్రతీ పేదవాడు సొంత ఇంటిలో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జగనన్న కాలనీ అనే పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులందరికీ ఇంటి స్థలాలు కేటాయించామన్నారు. వాటిలో త్వరలో ఇళ్లు కట్టి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అటువంటి కాలనీలో నివసించే లబ్ధిదారులు పచ్చని వాతావరణం,చల్లని గాలి ఆస్వాదించి తీరాలనే ఉద్దేశంతో ఆ కాలనీలో ప్రతి లబ్ధిదారుడు కనీసం పది మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమం కార్తీక పౌర్ణమి వరకు ప్రజల సహకారంతో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ ఉషశ్రీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హలియా రాణి, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, అటవీ శాఖ డి ఆర్ ఓ  టివి భార్గవ వర్మ, మరియు సిబ్బంది పాల్గొన్నారు.


 

 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...