బాలల సంరక్షణ కోసం ఆపరేషన్ ముస్కాన్
పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వీధి బాలల సంరక్షణకు జిల్లా పోలీసు శాఖ ఆదేశాలమేరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని టౌన్ పోలీస్ స్టేషన్ సి ఐ విజయ్ కుమార్ ప్రారంభించారు . ఆపరేషన్ ముస్కాన్ పై మహిళా పోలీసులు తో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీ ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్, గ్రామ పంచాయతీ, విద్య, ఐసీడీఎస్, కార్మిక శాఖాధికారులతో కలిసి ఆపరేషన్ ముస్కాన్‌ను విజయవంతం చేయాలని అన్నారు. 14 సంవత్సరాలు లోబడి విద్యకు దూరంగా ఉంటున్న బాల బాలికలను గుర్తించడం ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమని, పేదరికం కారణంగా వివిధ కర్మాగారాలు, వర్తక, వాణిజ్య కేంద్రాల్లో పని చేస్తున్న బాల కార్మికులు, రోడ్ల మీద భిక్షాటన చేసే బాలలను గుర్తించి వారందరినీ ప్రభుత్వపరంగా, ఎన్జీఓలు నిర్వహిస్తున్న చైల్డ్ హోమ్‌లలో చేర్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పుతామన్నారు. ప్రతి ఒక్క బాల, బాలిక చదువుకోవాలన్నదే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమన్నారు.
No comments:
Post a Comment