రోడ్డు గుంటలను పూడ్చిన పంచాయితీ అధికారులు
వి.ఆర్.పురం పెన్ పవర్ :
వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామ పంచాయితీ కి సంబంధించిన బి.సి.కాలనీ గ్రామంలో సాయిబాబా గుడివద్ద రోడ్డు మొన్న కురిసిన వర్షాల వలన అద్వాన్నంగా మారింది. ఆ రోడ్డు లో ప్రజలు కానీ, వాహన దారులు కానీ తిరగడానికి ఇబ్బందులు పడేవారు. ఇది గమనించిన వడ్డిగూడెం గ్రామపంచాయతీ అదికారులు, ఆ రోడ్డు లోని గుంటలను పూడ్చినారు. ఆ గ్రామ ప్రజలు పంచాయితీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం(సెక్రటరీ), బొడ్డు సత్యనారాయణ, ముత్యాల శ్రీనివాస్, పలివెల నాగేశ్వరరావు, బొర్రా నాగేశ్వరరావు, బాగుల ముత్యాల రావు, పుల్లిందల సత్యనారాయణ, బాగుల రేవతి, కోట్ల శేఖర్, కోట్ల శ్రీను, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment