Followers

కరోనా కలకలం మండపేట టౌన్ లో ఐదు తాపేశ్వరంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు


కరోనా కలకలం
మండపేట టౌన్ లో ఐదు
తాపేశ్వరంలో మూడు
కరోనా పాజిటివ్ కేసులు


వర్షం తో పారిశుద్ధ్య పనులకు ఆటంకం
అప్రమత్తంగా ఉండాలని అధికారులు  విజ్ఞప్తి...


పరీక్షలు అరకొరగా చేస్తున్నా మండపేట పట్టణంలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కాంటాక్ట్ పరీక్షలు నిలిచిపోగా ఇటీవల మండపేట టౌన్ పరిధిలో చేసిన వేర్వేరు వ్యక్తులు ఐదు గురికి పాజిటివ్ రిపోర్ట్ లు సోమవారం వచ్చాయి. అధికారులు దృవీకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండపేట మండలం తాపేశ్వరంలోని శివాలయం వీధి లో నివసిస్తున్న రూరల్ పోలిస్ స్టేషన్ కానిస్టేబుల్ కు పాజిటివ్ రాగా అతని కుటుంబ సబ్యులకు పరీక్షలు చేశారు. దీంతో అతని భార్య, కుమార్తె, హైదరాబాద్ నుండి వచ్చిన బావమరిది కి పాజిటివ్ గా తేలింది. దీంతో రూరల్ లో సోమవారం మూడు కేసులు నమోదు అయ్యాయి. 
ఇక టౌన్ కు సంబంధించిన 6 వ వార్డు ఆంద్రా బ్యాంకు వీధి లో ప్రముఖ రాజకీయ నాయకుడి కోడలుకు గతం లో పాజిటివ్ రాగా ఇప్పుడు ఆ ప్రముఖుడి తో బాటు ఆయన కుమార్తె కు పాజిటివ్ రిపోర్ట్ లు వచ్చాయి. బురుగుంట చెర్వు ఏరియా లోని బాల భవన్ పక్క వీధి లో ఓ వ్యక్తి కి పాజిటివ్ వచ్చింది. 18 వ వార్డు పరిధిలోని ఓం జ్యులరీస్ వెనుక బుక్కా వారి వీధి లో మరొక పాజిటివ్ నమోదు అయ్యింది.
27 వ వార్డు పరిధిలోని పార్థసారథి నగర్లో ఓ వ్యక్తి కి పాజిటివ్ తేలింది. కొన్ని చోట్ల ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టగా మరి కొన్ని చోట్ల వర్షం వల్ల పారిశుద్ధ్యపనులకు ఆటంకం ఏర్పడింది.  ఈ సందర్భంగా కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...