సెక్రటరీలకు, నాయకులకు సన్మానం.
వాలంటీర్లకు బహుమతులు ప్రధానం.
పోలవరం పెన్ పవర్
పోలవరం మండలం స్థానిక రెండవ సచివాలయంలో సోబ్బాన మోహన్ ఆధ్వర్యంలో పోలవరం మండలం వైసిపి కార్యకర్తలు వైసీపీ నాయకులకు, సచివాలయ సెక్రటరీలకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి, స్వీటు, హాటు పంచిపెట్టారు. అనంతరం పార్టీకి, ప్రజలకు ఉత్తమ సేవలందించిన వైసిపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర వెంకటరెడ్డి , వైసిపి మండల అధ్యక్షులు బుగ్గా మురళీకృష్ణ, ఏలూరు పార్లమెంట్ కార్యదర్శి దాకే మంగమ్మ, జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ పాతి మున్నీసా, పోలవరం మహిళ టౌన్ ప్రెసిడెంట్ దాసరి రాణి, అల్లు జగన్మోహన్, 1, 2, 3 సచివాలయ సెక్రటరీలు వై కొండల్ రావు, వై ప్రసాద్, శ్రీనివాస రావు లకు శాలువాలు కప్పి సన్మానించారు. వాలంటీర్ వ్యవస్థ మొదలైన నాటి నుంచి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను చేరువ చెయ్యడంలో విధులు సక్రమంగా నిర్వహిస్తున్న మూడు సచివాలయాల లో వాలంటీర్లకు రాజశేఖర్ రెడ్డి చిత్రపటం ఉన్న ఫెడ్ లను, పెన్నులను బహుకరించారు. కరోనా విపత్కర సమయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలోనూ ఎంతగానో శ్రమిస్తున్న వాలంటీర్ లను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment