Followers

పేద బ్రాహ్మణులకు  నిత్యావసర సరుకులు పంపిణీ


పేద బ్రాహ్మణులకు  నిత్యావసర సరుకులు పంపిణీ....



రూపాకుల రవికుమార్, ఆంధ్ర ప్రదేశ్,బి.జె.పి. మెడికల్ కన్వీనర్.


 పూర్ణా మార్కెట్, పెన్ పవర్.


పేరుకు అగ్ర వర్ణము కానీ నేటి సమాజంలో అణగారిన వర్గము రూపాకుల రవికుమార్ ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ  వైద్య విభాగము కన్వీనర్  .రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ,ప్రకృతి చికిత్సాలయ మహారాణి పేట మరియు శ్రీ గాయత్రి వెల్ఫేర్  కల్చరల్ యూత్ అకాడమీ సంయుక్త నిర్వహణలో మహారాణి పేట ప్రకృతి చికిత్సాలయ ఆవరణలో  పేద బ్రాహ్మణులకు  నిత్యావసర సరుకులు పంపిణీ    111వరోజు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రూపాకుల రవికుమార్ ముందుగా అర్చకులకు ,పురోహితులకు బియ్యం,నూనె,గోధుమపిండి మొదలగునవి పంపిణీ చేశారు.కరోనా లాక్ డౌన్ సమయంలో దేవాలయాలు  మూసి వేయటం వలన  ఈరోజు తెరిచిన  తర్వాత భక్తుల రాక తగ్గినందున   అర్చకులకు కుటుంబ పోషణ భారముగా  ఉన్నదని కరోనా  వలన పురోహితులకు  పనులు లేవని , ప్రభుత్వము  వీరిని ఆదుకోవాలని  అన్నారు .విశాఖ జిల్లాలో పురోహితులు  సుమారు 35 వేలమంది ఉన్నారని. ఇందులో  నగరములో  22 వేలమంది   ఉన్నారని,విశాఖ జిల్లాలో అర్చకులు సుమారు 20 వేలమంది ఉన్నారని,ఇందులో నగరములో 6 వేలమంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వము  కరోనా   సహాయనిధి పేరుతో సుమారు 1158మందిఅర్చకులకు 5000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేసారు మిగిలిన వారికి సహాయము అందలేదు కొన్ని దేవాలయములలో ధర్మ కర్తలు అర్చకుల మీద దౌర్జన్యము చేయుచున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎక్కువమందికి సహాయము అందటం లేదని  అన్నారు. వంశ పారంపర్యముగా వస్తున్న అర్చకత్వం చేస్తున్నా అర్చకుల కుటుంబాలలో మరియు పురోహితుల కుటుంబాలలో ఉన్న యువకులకు వివాహమునకు కన్యాదానము చేయుటకు కన్యాదాతలు ముందుకు రావటం లేదని అన్నారు.ఆర్థికముగా, సామాజికముగా, బ్రాహ్మణ వర్గము వెనకబడినదని రాజకీయ దన్ను లేని ఈ వర్గ ప్రజలు  ఎదుగుటకు బ్రాహ్మణులు అందరూ సమైక్యంగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ  కార్య్రమానికి ఏస్.మహేష్, డా.శ్రీలక్ష్మి, గేదెల.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...