వర్షపు నీటితో వీధులు జలమయం
తాళ్ళపూడి, పెన్ పవర్:
బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు తాళ్ళపూడి మండల ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు అన్నీ జల మయమయ్యాయి. కొన్నిచోట్ల ప్రజల రాకపోకలు ఇబ్బంది అయ్యాయి. రవాణా మార్గాలు, రహదారులు, వీధులు వర్షపు నీటితో నిండి పోయాయి. వర్షం నీరు కొన్ని ఇండ్లలోనికి ప్రవేశించినది. ఇప్పుడిప్పుడే కొన్ని పొలాలలో వారి నాట్లు వేస్తున్నారు. ఆ చేలు అన్నీ జలమయమయ్యాయి. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిళ్ళుతుందని రైతులు వాపోతున్నారు. గ్రామాల్లో డ్రైనేజీలు కొన్నిచోట్ల లేక వర్షపు నీరు, మురుగు నీరు, వెళ్లే దారిలేక గ్రామాలు జలమయమవుతున్నాయి. మండలంలోని పంచాయతీలు శ్రద్ధ తీసుకొని డ్రైనేజీలు వేర్పాటు చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.
No comments:
Post a Comment