ఎమ్మెల్యే వేణు కు మంత్రి పదవి పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ జెడ్పిటిసి గుల్లా. ఏడుకొండలు
గోకవరం పెన్ పవర్.
తన చిరకాల మిత్రుడైన చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పదవి లభించడం పట్ల మాజీ జెడ్పిటిసి, వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుల్లా ఏడుకొండలు హర్షం వ్యక్తం చేశారు.గురువారం గోకవరం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామచంద్రపురం శాసనసభ్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ వై ఎస్ ఆర్ సి పి పార్టీ పట్ల విధేయత కలిగిన కార్యకర్తగా పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు అన్నారు.2006లో జరిగినస్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టి ఆయన జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన సహచరుడు గా ఉంటూ తాను గోకవరం మండలం జడ్పిటిసి గా తన పాలన లోనాకు పనిచేయడానికి , మండలాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన నాకు ఎంతగానో అవకాశం కల్పించారు ఉన్నారు. వేణుగోపాల నాయకత్వంలో జిల్లా పరిషత్ అభివృద్ధి పథంలో పరిగెత్తించిన విధంగానే రాబోయే కాలంలో ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తన శాఖ లో పలు సంస్కరణలు చేపట్టి బీసీ సంక్షేమ శాఖకు మంచిపేరు తేవాలన్నారు.ఆయన నాయకత్వంలో తూర్పుగోదావరి జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని బిసి వర్గానికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించనా ముఖ్యమంత్రి కి గుల్లా ఏడుకొండల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో మంత్రి వేణుగోపాల్ సహకారంతో మండలాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని గుల్లా. ఏడుకొండలు తెలిపారు
No comments:
Post a Comment