Followers

కార్డులను పంపిణీ చేసిన వ్యవసాయ అధికారి


 గ్రామంలో  కౌలు రైతు గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన వ్యవసాయ అధికారి...... 



పెన్ పవర్, ఉలవపాడు


 ఉలవపాడు మండలం లోని మన్నేటికోట గ్రామం రైతు భరోసా కేంద్రం లో మండల వ్యవసాయాధికారి ఎం .మాల్యాద్రి అధ్యక్షతన మంగళవారం నాడు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.ప్రతి రైతు ఈ _క్రాఫ్ నమోదు చేసుకున్నట్లయితే ప్రభుత్వం అందజేస్తున్న లబ్ధి ఫలాలను పొందవచ్చని వ్యవసాయాధికారి తెలిపారు. అనంతరం గ్రామంలో ముగ్గురు కౌలు రైతు లకు  గుర్తింపు కార్డులను  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ బ్రహ్మయ్య వీహెచ్ ఏ  దీపిక మన్నేటికోట ఇంచార్జ్ వీఆర్వో పవన్ పంచాయతీ కార్యదర్శి జయశంకర్ గ్రామస్తులు గ్రామ రైతులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...