Followers

ఇళ్ల నుంచి బయటకు రావద్దు


కర్ఫ్యూ అమలుకు ప్రజలు సహకరించాలి.. 



- ఇళ్ల నుంచి బయటకు రావద్దు



-సి.ఐ కృష్ణ



రావులపాలెం, పెన్ పవర్



 జిల్లాలో తీవ్ర స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు రావులపాలెం సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల్లో 24గంటలపాటు అమలు చేస్తున్న కర్ఫ్యూ కు ప్రజలంతా సహకరించాలని సి.ఐ వి.కృష్ణ కోరారు. శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెంలో లాక్ డౌన్ నిబంధనలు అమలలో ఉన్నా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహన చోదకులకు శనివారం సాయంత్రం స్థానిక కళా వెంకట్రావు సెంటర్ లో సి.ఐ కృష్ణ, ఎస్సై పి.బుజ్జిబాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. కరోనా పాజిటివ్ కేసులు జిల్లాలో  పెద్ద ఎత్తున నమోదు అవుతున్న దృష్ట్యా ప్రజలు ఇకనైనా జాగ్రత్త వహించాలన్నారు. అధికారులు ఇచ్చిన సమయంలో మాత్రమే నిత్యావసర వస్తువుల కోసం బయటకు రావాలన్నారు. ఆదివారం ఉదయం 6నుంచి సోమవారం ఉదయం 6వరకు అమలు చేస్తున్న కర్ఫ్యూ కు ప్రజలంతా సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్.సి దుర్గారావు, కానిస్టేబుల్స్ గీతాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...