50లీటర్ల నాటు సారాయి స్వాధీనం
సారాయి రవాణా చేస్తున్న మోటారు బైక్ స్వాధీనం
800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
ఒక వ్యక్తిఅరెస్ట్. మరో ఇద్దరి పై కేసులు నమోదు
జగ్గంపేట, పెన్ పవర్
పెద్దాపురం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో టీమ్ లు పెద్దాపురం రంగం పేట మండలాల్లో దాడులు రూట్ వాచ్ లు నిర్వహించగా, పెద్దాపురం మండలం ఆనూరు గ్రామ పరిధిలో 30 లీటర్ల నాటు సారాయి ని మోటారు బైక్ పై తరలిస్తున్న చింతపల్లి సూరిబాబు అను వ్యక్తిని పట్టుకుని అరెస్టు చే సారు. సారాయిని, మోటార్ బైక్ ను స్వాధీన పర చుకున్నరు. అలాగే కొండపల్లి , రంగం పేట గ్రా మాల్లో 20 లీటర్ల నాటు సారాయి ,800 లీటర్ల బెల్లపు ఊట కనుగొని సంబంధిత ఇద్దరు వ్యక్తుల పై 2 కేసులు నమోదు చేయటం జరిగిందని పెద్దాపురం ఎక్సైజ్ సి ఐ . ఎం. రామకృష్ణ దాస్ తెలిపారు . ఈ దాడుల్లో పెద్దాపురం ఎక్సైజ్ ఎస్ ఐ.జె. విజయకుమార్. తదితర సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment