జర్నలిస్టులకు రు"50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి.
పరవాడ పెన్ పవర్
పరవాడ: ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు శనివారం పరవాడ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల కోరికలు దినంగా పాటించడం జరిగింది.కోవిడ్ వారియర్స్ కి ఇచ్చే భీమ సౌకర్యాన్ని జర్నలిస్టులకు కూడా కల్పించాలని కోరుతూ శనివారం ఉదయం పరవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ పి.వి.ఎల్. గంగాధర్ కు, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తహసిల్దార్ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రతినిధులు, లోకేష్, రవి, సన్యాసిరావు, సోము నాయుడు, అనిల్, శ్యామ్, చందు, పివి రమణ, సూరిబాబు, సిహెచ్ గోపి, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment