Followers

మంత్రి కారులో పట్టుబడ్డ 5 కోట్ల 20 లక్షల డబ్బు


మంత్రి కారులో పట్టుబడ్డ 5 కోట్ల 20 లక్షల డబ్బు ఫై విచారణ జరపాలి..............మాజీమంత్రి గొల్లపల్లి 


రాజోలు,  పెన్ పవర్ 


 


 
ఇటీవల మంత్రి బాలినేని కారులో దొరికిన 5 కోట్ల 20 లక్షల రూపాయల నగదు పై
ప్రభుత్వం వెంటనే  విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ
శనివారం రాజోలు మండల తాసిల్దారు కి
 మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వినతి పత్రం సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం లో మంత్రి బాలినేని కారులో దొరికిన  నగదు ఫై విచారణ జరపాలని, మంత్రి బాలినేని రాజీనామా చెయ్యాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రత లు పూర్తిగా క్షిణించాయని,  వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు ఈ సందర్బంగా గొల్లపల్లి,  మంత్రి బాలినేని స్టిక్కర్ తో ఉన్న కారు లో పెద్ద మొత్తం లో సొమ్ము తమిళనాడు పోలీస్ లకు  దొరకడంతో   నిజం చెప్పవలసిన భాద్యత మంత్రి తో బాటు ముఖ్యమంత్రి కూడ ఉందని, అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న బాలినేని తక్షణమే రాజినామ చెయ్యాలని గొల్లపల్లి డిమాండ్ చేశారు.   ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన దళిత న్యాయమూర్తి రామకృష్ణ ఫై  వైయస్సార్స సీపీ నాయకుల అండదండలతో రౌడీ మూకలు రాళ్లు రువ్వి, కర్రలతో పైశాచికంగా దాడి చేసి న్యాయమూర్తి రామకృష్ణ కుడి చెయ్యి విరగగొట్టడం జరిగిందని దీనిపై ప్రభుత్వం స్పందించి  ఆయనకున్యాయం చేయాలనిి కోరారు.ఇటీవల దళితులు, దళిత డాక్టర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాగే రాష్ట్రం లో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు,బలహీన వర్గాలకు చెందిన నాయకుల ఫై, తప్పుడు కేసులు బనాయించి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని గొల్లపల్లి అన్నారు, ప్రస్తుత ప్రభుత్వం ఏ వర్గాల ఓట్లు తో అధికారం లోకి వచ్చిందో అదే వర్గాల వారిని అణగతొక్కే ప్రయత్నం చేస్తుందని  ఆయన అన్నారు , పై కేసులు పెట్టి నానా హింసలకు ప్రజల ను గురి చేస్తున్నారని రాష్ట్రం లో అరాచక పాలన నడుస్తుందని గొల్లపల్లి అన్నారు.ఈకార్యక్రమంలో  మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకి లక్ష్మణ్,మట్టా రాధ,  గుబ్బల శ్రీనివాస్, చాగంటి స్వామి, కసుకుర్తి త్రినాధస్వామి, అడబాల చంటి, బేతినీడి శ్రీనివాస్, కేతా శ్రీనివాస్, రాపాక నవరత్నం, రాపాక ఆనంద్బాబు, రేవు జీవరత్నం, నార్కేడమిల్లి కనకం, రావి మురళి కృష్ణ, పామర్తి రమణ, కడలి నాగేశ్వరావు,ఉండ్రు రామకృష్ణ, కడలి వెంకటేశ్వరావు,  గుబ్బల కుమార్, కడలి వెంకటరమణ, దాడి కృష్ణ, మట్టా శ్రీనివాస్, పొన్నమండ కొండ, నార్కేడమిల్లి విష్ణు, దాకే ఏడుకొండలు, చిట్టూరి కిట్టు, పితాని సూరిబాబు, నల్లి శ్రీనివాస్, మట్టపర్తి అబ్బులు,  చెల్లుబోయిన మోహన్  శ్రీనివాస్, బొడ్డపల్లి చిట్టిబాబు, పెచ్చెట్టి గణేశ్వరావు కట్టా లక్ష్మీపతిరావు, పెచ్చెట్టి వెంకటశ్రీనివాస్, కట్టా జయరామారావు, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...