Followers

ర్యాలి... గ్రామంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చెయ్యాలి

ర్యాలి... గ్రామంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చెయ్యాలి


పెన్ పవర్, ఆత్రేయపురం 



 మండలం రాష్ట్రంలో కొత్తగా జూనియర్ కళాశాలలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నందున కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసునూరి వెంకటరాజు( గబ్దర్ సింగ్) డిమాండ్ చేశారు. ఆదివారం ర్యాలి గ్రామ టిడిపి అధ్యక్షులు మెర్ల నాగేశ్వరరావు స్వగృహం వద్డ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.వెయ్యి మంది విద్యార్థులు కలిగిన ర్యాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే కళాశాల నిర్వహణకు గతంలోనే అధికారులు నివేదికలు సిద్దం చేశారని తెలిపారు.ఆత్రేయపురం మండలంలో 10వేలు జనాభా కలిగిన అతి పెద్ద గ్రామం ర్యాలిలోని విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టకొని జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.మండలంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక పోవడంతో అధిక ఫీజులు చెల్లించి ప్రయివేటు కళాశాలలో చదవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.మండలంలో జూనియర్ కళాశాల అందుబాటులో లేకపోవడంతో 10తరగతి తరువాత  ఆడపిల్లలు చదువులు ఆపేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పలు గ్రామాలకు కూడలిగా ఉన్న ర్యాలి గ్రామంలో  జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని తెలుగు దేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చిటికెన సత్యనారాయణ ,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పాలింగి రవిచంద్ర,నాయకులు గార్లపాటి గోపాలకృష్ణ, ముత్యాల బాబ్జి,ముళ్ళపూడి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...