Followers

లాక్ డౌన్ ను నిష్పక్షపాతంగా  అమలు చేస్తున్న ఎస్.ఐ రమేష్


లాక్ డౌన్ ను నిష్పక్షపాతంగా  అమలు చేస్తున్న ఎస్.ఐ రమేష్


కొత్తపేట, పెన్ పవర్


జిల్లాలో నేటి నుండి ఉదయం 11 గంటల తరువాత జిల్లా అంతటా కలెక్టర్ పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో కొత్తపేట ఎస్.ఐ కె.రమేష్ ఉదయం 11 తరువాత లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్నారు.కొత్తపేట మండలంలోని 10 గ్రామాలను తన సిబ్బందితో  కలిసి సందరిస్తున్నారు.పట్టణంలోనే కాక గ్రామాల్లో కూడా సందరిస్తూ అక్కడ కూడా ఏమైనా షాపులు తెరిచినట్లయితే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.గ్రామాల్లో సైతం ఎవరూ కూడా బయటకు రాకూడదని అలా తిరిగితే ఎవరినీ కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో పూర్తిగా 11 తరువాత లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో  వేరే గ్రామాలకు కానీ, వేరే ఊళ్లకు వెళ్లడం కాని నిషేధం అని చెప్పారు.అలా కాకుండా ఎవరైనా ఊరి ప్రయాణాలు కొనసాగిస్తే వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని చెప్పారు.దీన్ని ప్రజలందరూ గమనించాలని ఎస్.ఐ కోరారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...