Followers

కుకునూరు రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవం


 



కుకునూరు రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవం

 

తాళ్ళపూడి,  పెన్ పవర్: 

 

వై.యస్.రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రతీ రైతు భరోసా కేంద్రంలో బుధవారం రైతు దినోత్సవం జరిపారు.   తాళ్ళపూడి మండలం లోని కుకునూరు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేచి నివాళులు అర్పించారు. అదేవిధంగా  అక్కడ రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలు జరిపామని తాళ్ళపూడి 2 సెక్రెటరీ యస్.శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు సంబంధించిన పథకాలు గురుంచి, పొలంబడి గురుంచి, రైతు భరోసా వినియోగo, లబ్ధి తదితర విషయాలపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో వి.ఎ.ఎ.లు ఆనంద్, రేవతి, వి.ఆర్.ఒ. లీలావతి, రైతులు, గ్రామపెద్దలు, నాయకులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...