మూగబోయిన మున్సిపల్ కార్యాలయం
మండపేట, పెన్ పవర్
కార్యాలయ సిబ్బంది కి కరోనా సోకడంతో మున్సిపల్ కార్యాలయం మూగబోయింది. నిత్యం అధికారులు, సిబ్బంది , ప్రజలతో సందడిగా కనిపించే మున్సిపల్ కార్యాలయం ప్రస్తుతం వెల వెల బోయి కనిపిస్తోంది. ప్రస్తుతం కార్యాలయంలోని అన్ని గదులను సానిటైజ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ తెలిపారు. సోమవారం నుండి కార్యాలయం యధావిధిగా పని చేస్తుందన్నారు. కొన్ని మినహాయింపులతో ఉద్యోగులు తిరిగి విధుల్లో పాల్గొంటారన్నారు. అత్యవసర సేవలు మినహా ఇతర పనులు నిమిత్తం ప్రజలను ప్రస్తుతానికి అనుమతించమని తెలిపారు. వాస్తవానికి మున్సిపల్ ఉద్యోగులందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకుని నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రమే విధుల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే 10 రోజులు క్రితం చేయాల్సిన పరీక్షలే నేటికీ పూర్తి కానీ పరిస్థితుల్లో ఇవన్నీ జరగాలంటే అది ఆషామాషీ వ్యవహారం కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు.
No comments:
Post a Comment