పరిపాలనకు నోచుకోని ఇంజినీరింగ్ భవనం
గూడెం కోత్తవీధి, పెన్ పవర్
గూడెం కోత్త వీధి మండల కేంద్రంలో ఇంజినీరింగ్ అధికారులు
విధులు నిర్వహించడానికి కొత్త పరిపాలనా కొత్త పరిపాలనా భవనం నిర్మాణం పూర్తి అయి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. మండలాలు ఏర్పడి నాటినుండి మండల ఇంజినీరింగ్ అధికారి ఇతర సిబ్బంది విధులు నిర్వహించడానికి సొంత భవనం లేక ఇంతవరకు ఇంజినీరింగ్ సిబ్బంది. చింతపల్లి మండలం నుండే విధులు నిర్వహిస్తున్నారు. గూడెం కోత్త వీధి మండలంలో ఎటువంటి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు. ఎం బుక్. రికార్డు చేయించుకొవడానికి బిల్లు చేయించుకొవడానికి, చింతపల్లి వెళ్ళిరావలసిన దుస్థితినెలకొనివుంది. చివరకు కొత్త భవనాలుకి సిమ్మెంట్
రోడ్లు నిర్మాణాలకు మార్కింగ్ ఇవ్వవలసివుండగా. ఎ. ఇ. వర్కు ఇన్స్ పెక్టర్, చింతపల్లి నుండి రాకకొసం ఎదురు చూడవలసిన పరిస్థితి. పేరుకే గూడెం కోత్తవీధి.... మండల ఇంజినీరింగ్ కార్యాలయం నిర్వహణ అయిన ఎన్నో సంవత్సరాలుగా చింతపల్లి మండలం కేంద్రంలో వుంటున్నప్పటికి ఇది ఎ ప్రాంతంలో వుంటుందో ఎవ్వరికీ తెలియకపోవడం బాధాకరం. ఇదే విషయాన్ని చెబుతూ మండలప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం పనులు పూర్తి చేసినా... కొంతమంది కాంట్రాక్టర్లు బిల్స్ కొసం ఎప్పుడు కార్యాలయానికి వెళ్ళినా ఇంజినీరింగ్ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్ లు, అందుబాటులో వుండడం లేదని బిల్స్ కొసం పదిసార్లు తిరిగిలేక వారు నివాసం వుంటున్న గృహాలు వద్ధకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపలా కయవలసి వస్తుదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడెం కోత్తవీధి మండలానికి చెందిన ఇంజినీరింగ్ సిబ్బంది ఇతర ప్రాంతాలు నుండి రాకపోకలు సాగించడం వలన మండలంలో పలునిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని మండలంలోఎక్కడచూసిన అసంపూర్తిగా నిర్మించి వదలివేసిన భవనాలు కనిపిస్తుయని మండల ప్రజలు విస్మయం వ్యాక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా పాడేరు ఎమ్మెల్యే స్పందించిగూడెం కొత్తవీధి కొత్త మండల ఇంజినీరింగ్ కార్యాలయం ప్రారంభించి అన్నిశాఖల ఇంజినీరింగ్ అధికారులు మండల కేంద్రంలో విధులు నిర్వహించే విధంగా తక్షణమే చర్యలు తీసుకొవాలని గూడెంకొత్తవీధి మండల ప్రజలు కొరుతున్నారు .
No comments:
Post a Comment