40 మంది ఉద్యోగులకు కోవిడ్ పరీక్షలు..
సామర్లకోట, జూలై,22 పెన్ పవర్
సామర్లకోట పట్టణ పరిధిలో బుధవారం పలు ప్రభుత్వ శాఖలకు చెందిన 40 మంది ఉద్యోగులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులకు సయితం పాజిటివ్ రిపోర్టులు నమోదవుతున్న నేపధ్యంలో సామర్లకోట పట్టణ పరిధిలో మున్సిపాలిటీ,మెప్మా,ప్రజారోగ్య శాఖ,పోలీస్ శాఖలకు సంబంధించి ఒక్కో శాఖ నుంచి పది మంది చొప్పున రోజుకు 40 మందికి ఈ పరీక్షలను నిర్వహిస్తూ వస్తున్నారు.దానిలో భాగంగా ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబుతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. కాగా మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరికి పాజిటివ్ రాగా బుధవారం తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటి వరకు మున్సిపాలిటీ పరిధిలో వందమందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు కమిషనర్ చెప్పారు.మిగిలిన సిబ్బందికి కూడా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.
No comments:
Post a Comment