Followers

దళితులు, బలహీన వర్గాలమీద ప్రభుత్వ దాడులు ఆపాలి..... మాజీ మంత్రి గొల్లపల్లి 


దళితులు, బలహీన వర్గాలమీద ప్రభుత్వ దాడులు ఆపాలి..... మాజీ మంత్రి గొల్లపల్లి 


రాజోలు, పెన్ పవర్,


 రాజోలు మండలం, తాటిపాక గ్రామంలో తన నివాసం వద్ద  మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు   విలేకర్ల  సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం లో దళితులు, బలహీన వర్గాల మీద  ప్రభుత్వ దాడులు రోజు, రోజుకు పెరిగిపోతున్నాయని, ఇది కక్ష పూరిత దాడులు అని గొల్లపల్లి అన్నారు. దళిత,బలహీన వర్గాల ఓట్లతో అధికారం లోకి వచ్చిన ఈ ప్రభుత్వం  దళితులపైనే కక్ష సాధింపు చర్యలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నదని ,ఇదిజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా భావిస్తున్నానని గొల్లపల్లి ఆవేదన చెందారు. దళితులు, వెనుబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమం పై   ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం గా  వ్యవహరిస్తుందని,
 బలహీన వర్గాలకు చెందిన  న్యాయమూర్తులు, ఉన్నతాధికారులపై దాడులు చేయటం, తప్పుడు కేసులు బనాయించటం, తద్వారా అరెస్ట్ లు చేయటం ప్రభుత్వానికి తగదని గొల్లపల్లి అన్నారు.వెనుకబడిన వర్గాల, దళితుల యొక్క సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేయటం లేదని, ప్రశ్నించే వారిపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారని ప్రభుత్వం అన్నిటా విఫలమైందని గొల్లపల్లి అన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...