Followers

దిశ చట్టం అమలు చేయాలని దళితసంఘల డిమాండ్





దిశ చట్టం అమలు చేయాలని దళితసంఘల డిమాండ్!

 

 

రాజమండ్రి, పెన్ పవర్ ప్రతినిధి

 

 ఏపీలో దిశ చట్టం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు అన్ని ఏమి అయ్యాయనే దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.రాజమండ్రిలో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై దళిత సంఘాల నాయకులు పులి ప్రసాద్, నూకతట్టు వెంకటరమణ, బుంగ సతీష్ కుమార్ ,వల్లూరి సత్యనంధం ఐతి రాజు కుమార్  ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో బాదితురాలిని పరమర్శించినారు. అనంతరం మాట్లాడుతు బాలికపై అత్యాచారం అమానుషమని మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు . చేస్తే సరిపోదు ఒక దళిత స్త్రీ కరోనా సమయంలో కుటుంబము  గడవక చెప్పులు షాప్ లో పని చేయడానికి తన పక్కింటి ఆమె అనిత తో మాట్లాడి పని చేయడానికి తీసుకు వెళ్లి ఒక అబ్బాయితో ప్రేమలో దింపి అబ్బాయి ద్వార  ఏడుగురు దుండగులు ఆటోలో ఎక్కించుకుని గోకవరం బస్టాండ్ సమీపంలో వేరే స్త్రీ ఇంటికి తీసుకెళ్ళి నాలుగు రోజులు అత్యాచారం చేయడం దారుణమైనటువంటి  పరిస్థితి మానవత్వమే మర్చిపోతున్న టువంటి స్త్రీలను కఠినంగా శిక్షించాలని అన్నారు. తమ కూతురు ఆచూకి తెలియడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సకాలంలో స్పందించలేదని అసెంబ్లీలో ముక్తకంఠంతో ఆమోదం పొందిన దిశ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన రాజమండ్రిలోనే సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏం చేస్తుందని అన్నారు. చట్టం చేయడం కాదు నిబద్ధతతో అమలు చేస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని అన్నారు.ముఠా అరాచకాలపై ఆ ఘటన దళితులందరూ తలదించుకునేలా చేసిందని నాలుగు రోజులు చిత్రహింసలు పెట్టి నా ఆ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సామూహిక అత్యాచార ఘటనలో నిందితులంతా రోడ్డుపై ఖాళీగా తిరుగుతు దోపిడీలు చేస్తూ మత్తుమందు సైతం వాడడం హాబీ బాలికను తీసుకెళ్లి ఆ బ్లేడ్ బ్యాచ్ కి యువకులకు అప్పగించింది .అనిత ముందస్తు ప్రణాళిక ప్రకారమే రాజమహేంద్రవరం గోకవరం  బస్టాండ్ దగ్గర నాలుగు రోజులు చిత్రహించలకు గురిచేసి కోరుకొండ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలి పెట్టి దైర్యంగా వెళ్లి పోయారు. అంటే వారి వెనుక పెద్ద నాయకులే ఉన్నారని పూర్తిస్థాయిలో విచారన జరిపి అందరిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...