కారంచేడు మారణకాండకు 35 ఏళ్లు
గండేపల్లి పెన్ పవర్
కారంచేడుమారణకాండకు35ఏళ్లువచ్చినావని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్రప్రధాన కార్యదర్శి పులి ప్రసాద్ అన్నారు.ప్రకాశంజిల్లా చీరాల మండలంలో ఉన్నా గ్రామం కారంచేడు1985 జూలై15వరకు ఆ వూరు ఆ జిల్లాలోనే సరిగ్గా తెలియదు కానీ ఆ రోజు తర్వాత నుంచి దేశంలో కారంచేడు మారుమ్రోగిపోయింది జూలై 16 ఉదయం దళితుల త్రాగునీరు చెరువులో కి రాయినీడి శ్రీనివాసరావు పశువులను తోలాడు దీనిని మున్నంగి సువార్త అనే ఒక మాదిగ స్త్రీ ప్రశ్నించింది ఈ క్రమంలో కమ్మ యువకులు ఆమెతో వాగ్వాదానికి దిగడం తో పాటు కులం పేరుతో దూషించారు దీనిపై ఆగ్రహించిన సువార్త తన మంచినీటి బిందెతో వారిపై దాడి చేసింది. దళితవాడకు చెందిన కత్తి చంద్రయ్య మన్నెం సువార్త శ్రీనివాసరావు వారించే ప్రయత్నం చేశారు .వెంటనే ఈ విషయం ఊరిలో తెలియడంతో శ్రీనివాసరావు కి మద్దతుగా కొందరు కమ్మ పెద్దలు యువకులు అక్కడికి వచ్చారు దళితులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు పెద్దల జోక్యంతో అప్పటికి వివాదం సద్దుమణిగింనప్పటికి ఏదో జరగబోతుందని భయం దళితులను వెంటాడింది. ఊహించినట్లుగానే 17వ తేదీ కారంచేడులో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వందలాదిమంది తెల్లవారుజామున దళిత వాడ పై విరుచుకుపడ్డారు గోడలు కత్తులతో రాక్షసంగా క్రూరాతి క్రూరంగా దళితయువకులను వెంటాడారు స్త్రీల పై అత్యాచారం చేసినారు. అక్కడితో ఆగకుండా గాయపడిన మహిళలను ఒక చోటకు చేర్చి తగలబెట్టే ఎందుకు ప్రయత్నం చేశారు ఈ ఘటనలో ఆరుగురు మాది కులస్తులు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ మారణ కాండ భయాందోళన గురైన దళితులు కారంచేడు వదిలి చీరాలకు పారిపోయారు వారి ని చీరాల మాలలు లూధరన్ చర్చిలో ఆశ్రాయం కల్పించి మాదిగల చుట్టు మాలలు కాపలకస్తు భోజన లు ఏర్పటు చేసి మాలలు రక్షణ కల్పించారు ఈ సంఘటనపై రాష్ట్రం దేశం ఉలిక్కిపడ్డాయి దళిత, సామాజిక ప్రగతిశీల సంఘాలు బాధితులకు అండగా నిలిచాయి. నెలాఖరులో కారంచేడు బాధితులు ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పడి న్యాయ పోరాటం చేసింది బాధితులకు భూమి నివాసం ఏర్పాటు చేయాలనే 28 డిమాండ్లతో కత్తి పద్మారావు సలగల రాజశేఖర్ బొజ్జా తారకం వంటి వారు ఉద్యమించారు .దీంతో దిగివచ్చిన ప్రభుత్వం బాధితులకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటు పనులను పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శంకరన్ ను నియమించింది ఆయన పొలాలు, స్థలాలు ,పక్కా ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి పనులు .స్వయం శిక్షణ ఇలా అనేక మార్గాల్లో బాధితులకు అండగా నిలిచారు .మరోవైపు సుదీర్ఘ విచారణ అనంతరం 24 ఏళ్ల తర్వాత దోషులకు శిక్షలు పడ్డాయి.
దీనికి ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న నాటి సీఎం ఎన్టీఆర్ వియ్యంకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి దగ్గుబాటి చెంచురామయ్యను నక్సల్స్ కాల్చి చంపారు 2008 లో ఈ కేసులో సుప్రీం జోక్యం చేసుకోవడంతో విచారణ వేగంగా సాగింది తుది తీర్పు వెలువడే నాటికి దోషుల్లో చాలామంది చనిపోయరు. చివరకు నిందితుల్లో ఒకరికి జీవితఖైదు 29 మందికి మూడేళ్ల శిక్ష పడింది మరోవైపు కారంచేడు ఘటనకు సాక్షిగా ఉన్న ఆలేసమ్మ హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది. అయితే ఈ మారణ హోమం తర్వాత దళితులు తమ అస్తిత్వం కోసం హక్కుల కోసం ఆత్మరక్షణకోసం పిడికిలి బిగించారు. 1989 లో వచ్చిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తో పాటు దేశవ్యాప్తంగా సాగిన పలు దళిత ఉద్యమాలకు కారంచేడు ఘటనే స్పూర్తి.దళితుల సమస్యలన్నిటికీ పరిష్కారం రాజ్యాధికారమే అన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు నినాదాన్ని దళితులు మెదళ్లలో నింపింది దళితకులాల సమస్యలను సమాజంలో ప్రభుత్వంలో చర్చకు పెట్టింది అప్పటి వరకు మీగిలిన పార్టీలనే నమ్ముకుని బతికిన దళితుల్లో కారంచేడు ఘటన తర్వాత ఊహించలేనంతటి మార్పు వచ్చిందని పులి ప్రసాద్ అన్నారు.
No comments:
Post a Comment