Followers

బరిలో 32వ వార్డు టీడీపీ అభ్యర్థి గా  పంపాన రాజ్యలక్ష్మే


బరిలో 32వ వార్డు టీడీపీ అభ్యర్థి గా  పంపాన రాజ్యలక్ష్మే

 

పూర్ణా మార్కెట్, పెన్ పవర్

 

  32వ వార్డు భాద్యతలు అల్లిపిల్లి జగ్గా రావు, దాసరి దుర్గా రెడ్డి వార్డు సామాన్య కార్యకర్తగా, టీడీపీ అభ్యర్థి గా  పంపాన రాజ్యలక్ష్మినే  పోటీలో ఉంటారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలియజేశారు.

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన  విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో  తేది 29-06-20,న 32వార్డు కమిటీ మీటింగ్ లో ప్రస్తుతానికి దాసరి దుర్గా రెడ్డి టీడీపీ సామాన్య కార్యకర్త  గానే ఉంటారు  32వార్డు భాద్యతలు వార్డు కమిటీ కోరిక మేరకు అల్లిపిల్లి జగ్గా రావు కొనసాగుతారని  కరోనా వంటి విపత్కార పరిస్థితుల్లో చాలా మంది జీవనోపాధి కోల్పోయిన సందర్భంలో నిరుపేదలు నివసించే వార్డు లో అందరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయటమే కాకుండా ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిన సకాలంలో ముందుండి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఆర్ధిక సహాయం చేస్తూ  ప్రజలకు సేవలందించిన కారణంగా మరియు ప్రజలకు అందుబాటులో ఉంటూ 

వార్డు లో వచ్చిన సమస్యలు పరిష్కరించటంలో అధికారులతో మమేకమై కృషి చేస్తున్న కారణంగా రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో 32వార్డు టీడీపీ అభ్యర్థి గా పంపాన రాజ్యలక్ష్మినే  పోటీలో ఉంటారని మరియు 32వార్డు కార్యవర్గమంతా పార్టీ నియమ, నిబంధనలను పాటిస్తూ టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...