తాళ్ళపూడిలో 3వ రెడ్ జోన్ ఏర్పాటు
తాళ్ళపూడి, పెన్ పవర్:
తాళ్ళపూడి గ్రామంలో బి.సి. కాలనికి దగ్గరలో స్వగృహము కలిగిన 45 సంవత్సరాలు కలిగిన వ్యక్తి రాజమండ్రిలో ప్రైవేట్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాడు. ఇతను తీవ్రమైన జ్వరంతో బాధపడుచుండగా, కరోన టెస్ట్ చేయగా శుక్రవారం సాయంత్రం కరోన పోజిటివ్ అనితేలింది అని తాళ్ళపూడి పి.హెచ్.సి. డాక్టర్ రమణ నాయక్ తెలిపారు. ఆరోజు రాత్రి అతనిని ఐసోలేషన్ కు తరలించామని, అతనితోనే కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులు కరోన శాంపిల్స్ పైకి పంపించామని, ఆ వ్యక్తులను హోమ్ క్వారంటైన్ చేశామని తెలిపారు. ఎం.ఆర్.ఒ. ఎం.నరసింహమూర్తి ఆదేశాలమేరకు, పంచాయతీ కార్యదర్శి వీరన్న ఆచుట్టు ప్రక్కల ప్రాంతమంతా రెడ్ జోన్గా ప్రకటించి, పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ చల్లించి, సానిటైజ్ చేయించారు. మరియు బయవారు లోపలికి, లోపలివారు బయటకు వెళ్లకుండా తడికలు నిర్మిOచారు. తాళ్ళపూడి యస్.ఐ. జి.సతీష్ తమ సిబ్బందితో రెడ్ జోన్ ప్రాంతంలో బందోబస్తు నిర్వహించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆ జోన్లో డ్యూటీలు చేస్తున్నారు.
No comments:
Post a Comment