ఊరు.. ఉలిక్కిపడింది..
* గోకవరంలో 38 కేసులు
* ఒకేరోజు 29 కేసులు నమోదు
* సంజీవని బస్ ని ఏర్పాటు చేయాలి
* అందరు జాగ్రత్తలు పాటించాలి
గోకవరం పెన్ పవర్.
ప్రమాదం ఎదురుగా వచ్చేసింది... శ్వాస తీయటంలో తడబాటు పడే క్షణాలు కనిపిస్తున్నాయి.. పొగరుగా తల ఎగరేస్తే హాస్పిటల్ లో పడుకోబెట్టే రోజులను చూస్తున్నాము.. అందరు జాగ్రత్తలు పాటించాలి.. మీ ప్రాణాల తో పాటు పక్కవారి ప్రాణాలు కూడా ముఖ్యమే.. ఆలోచన చేయండి.. ప్రమాదాన్ని నివారించండి..గోకవరం మండల కేంద్రంలో ఒకేసారి 29 కరోనా కేసులు నమోదు అయ్యాయి..ఒక్కసారిగా ఊరు ఉలిక్కిపడింది..మత్తు నిద్ర వదిలిపోయింది.. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నమోదు అవుతున్న జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఒకేసారి 29 మందికి సోకటం తో అందరు భయపడుతున్నారు. గోకవరం తో పాటు పక్క గ్రామాలు కలవరపడుతున్నాయి. పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖ తో పాటు నాయకులకు కరోనా సోకటం తో ఆందోళన మొదలైంది. గ్రామంలో ప్రధానమైన అధికారులకు పాజిటివ్ రావటం పై ప్రజలు ఆలోచించాలి. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. విచ్చల విడిగా తిరగటం మానుకోవాలి. ఇంకా గోకవరంలో కేసులు నమోదు అయ్యే పరిస్థితి ఉంది కనుక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. అందరు రాజమండ్రి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోలేరు. కనుక అధికారులు సంజీవని బస్సుని ఏర్పాటు చేస్తే మంచిది. గోకవరం ప్రాంతంలో అనుమానం ఉన్న వ్యక్తులు ఈ బస్సు వద్ద పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా ఉంటుంది. గోకవరం హై స్కూల్ వద్ద గాని, జూనియర్ కాలేజి వద్ద గాని సంజీవని బస్సు ని ఏర్పాటు చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవటానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొంతమంది వెళ్లి పరీక్షలు చేయించుకోకుండా వెనక్కి వచేస్తున్నారు. ఎవరు చూసేవారు లేక పట్టించుకునే వారు కరువై దిగులతో వెను తిరుగుతున్నారు. గోకవరం నుండి రాజమండ్రి 30 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లిన ఫలితం శూన్యం. అధికారులు దృష్టి సారించి సంజీవని బస్సు వచ్చేందుకు ప్రయత్నాలు చేయాలి. అలాగే నియోజకవర్గ స్థాయి నాయకులు బస్ కోసం రికమండేషన్ చేయాలి.జనాలు విచ్చల విడిగా తిరగటం తగ్గించాలి.. మద్యం షాపులను వీలైతే మూసే విధంగా చర్యలు తీసుకోవాలి. సారా అమ్మకాలు ఆగాల్సి ఉంది.. శృతి మించి జరుగుతున్న సారా అమ్మకాల పై అధికారులు కొరడా ఝళిపించాలి.. టైం ప్రకారం దుకాణాలు మూసివేయ్యాలి.. దొంగచాటు వ్యాపారాలు కొద్ది రోజులు ఆపండి. ఇన్ని రకాల విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే కరోనను నియత్రించవొచ్చు.. ఇది అందరికీ సంభదించిన విషయం.. ఆలోచించండి..
No comments:
Post a Comment