తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
పూర్ణా మార్కెట్, పెన్ పవర్.
సింహాచలం దేవస్థానములో తొలగించిన ఔట్ సోర్సింగ్.
ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోనీ ధార్మిక విధులకు ఆటంకం కలగకుండా చూడాలని, మూగజీవ పరిరక్షణలో భాగంగా గోవులను కాపాడి, భక్తులు మొక్కుల రూపంలో ఇచ్చిన గోవులను కాపాడాలని విశాఖలో అర్బన్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు వాసుపాల్లి గణేష్ కుమార్ ఈ రోజు సింహాచలం దేవస్థానము ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రమరాంబకు వినతి పత్రం అందజేశారు 183 సిబ్బందిని తొలగించి వారి కుటుంబాలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చించారు దేవస్థానం కార్పెస్ ఫండ్ ద్వారా ప్రభుత్వానికి యేట 25 కోట్లు సమకూరుస్తుంది అని కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆదాయంతో నిధులు సమకూర్చి జీతాలు ఇవ్వలేర అని ప్రశ్నించారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక పక్క కార్పొరేషన్ స్థాపించి ఒక పక్క ఉన్న ఉద్యోగుల్ని తీసేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు త్వరలో కలెక్టర్ని కలసి విషయం వివరిస్తామని తెలియజేశారు గత రెండు వారములుగా తెలుగు దేశం భీమిలి కోర్ కమిటీ సభ్యులు పాసర్ల ప్రసాద్ వార్డ్ అధ్యక్షులు పి వి.నరసింహం ఆధ్వర్యములో చేసిన పోరాటం వలన 30 మంది గోశాల సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారని అదే విధంగా మిగిలిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని వాసూపల్లి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా భీమిలి కోర్ కమిటీ సభ్యులు పాశర్ల ప్రసాద్, కొరడా రాజబాబు, గంట నూకరాజు, డి ఎ వి.రాజు, కె. లీలావతి, అధికార ప్రతినిధి సతివాడ శంకర్ రావు, 98వ వార్డ్ అధ్యక్షులు పి వి. నరసింహం, లండ శ్రీను, జీ. వి.రమణ, పి. శ్రీనివాస్, జీ.బాబు తదితులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment