Followers

పాము కాటుకు గురై వ్యక్తి మృతి

పాము కాటుకు గురై వ్యక్తి మృతి

రాజవొమ్మంగి,పెన్ పవర్ 

మండలంలోని దూసరపాము గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పొట్టకూటి కోసం పక్క జిల్లా వెళ్లి పాము కాటుకు గురై మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామానికి చెందిన పంతం బుల్లయ్య (35) అనే వ్యక్తి నాడు - నేడు పనుల నిమిత్తం విశాఖ జిల్లా గొలుగొండ గ్రామంలో నివాసముంటున్నారు. అయితే గురువారం రాత్రి 10 గంటల సమయంలో బుల్లయ్య బహిర్భూమికి వెళ్లి వస్తుండగా పాము కాటు వేయడంతో స్థానికులు, తోటి పనివాళ్ళు బుల్లి య్యను సంఘటన స్థలం నుండి నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని బుల్లయ్య మృతిచెందడంతో వారి వీధి పడ్డారని వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...