పద్మనాభం 21 వ వర్ధంతి కాంగ్రెస్ ఘన నివాళులు.
రాజోలు, పెన్ పవర్
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ప్రజా నాయకుడు స్వర్గీయ శ్రీ పంతం పద్మనాభం గారి 21 వ వర్ధంతి సందర్భముగా రాజోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.ఆయన జిల్లాకే కాక రాష్ట్రానికి కులమతాలతో సంబంధం లేకుండా ఆయన ఎన్నో సేవలు చేశారని మెట్ట ప్రాంతంలో పంతం వారు కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రుద్రరాజు గోపాలకృష్ణ రాజు లక్కవరంలో జరిగిన కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమములో కూనపు రెడ్డి కృష్ణ ,అల్లూరి మధు రాజు, చిలకపాటి శ్రీధర్ , అప్పన శ్రీ రామకృష్ణ, గెడ్డం వెంకటేశ్వరరావు,పెచ్చెట్టి పండు, అప్పారి శ్రీను, పెచ్చెట్టి శివశంకర్ తిరుమల గవర్రాజు, వలవల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment