గోవింద్ కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
రొయ్యల పరిశ్రమ ధర్మవరం గ్రామస్థులు ఆందోళన.
ఎస్.రాయవరం/విశాఖపట్నం_బ్యూరోఛీప్ (పెన్ పవర్)
వైద్యం అందక గోవింద్ మృతి చెందాడని మృతుని కుటుంబానికి రూ20లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి అని ధర్మవరం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గురువారం మండలం లోని కోస్టల్ కార్పొరేషన్ రొయ్యల పరిశ్రమ వద్ద ధర్మవరం గ్రామస్తులు ఆందోళన .చేపట్టారు. ధర్మవరం కు చెందిన గొనదర గోవింద్ గత మూడేళ్ల గా రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్నడు. గోవింద్ పనిలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వైద్తం కోసం తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అందుబాటులో ఆసుపత్రి లేక పోవడం వల్లే గోవింద్ చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోవింద్ మృతి కుటుంబానికి తీరని లోటని ఆ కుటుంబానకి ఆర్దిక సహాయం అందించాలని కోరుతు కార్మికులు పోయే బస్సలు అడ్డుకున్నారు.ఈ సంఘటనను పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారు. పోలీసులకు ఆందోళన కార్ల మద్య వాగ్వివాదం జరిగింది. పోలీసుల సహకారంతో కార్మికుల బస్సులను బయటకు పంపించారు..
No comments:
Post a Comment